Jul 27, 2008

చింతకాయల రవి ముహూర్త విశేషాలు


వెంకటేష్ యొక్క నూతన చిత్రం 'చింతకాయల రవి' ముహూర్త సన్నివేశాలను మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సమర్పిస్తున్నారు. వెంకటేష్ హీరోగా నల్లమలుపు బుజ్జి కి ఇది రెండవ సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన 'లక్ష్మి' చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకు తెలిసిందే. చింతయకాయల రవి అనే పేరుతో, సాఫ్టువేర్ ఇంజనీర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ కొత్త చిత్రం ఎలా వుంటుందో నని ప్రతి ఒక్కరూ ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.